తెలంగాణ ఏటా ఆమోదిస్తున్న బడ్జెట్లలో 20–25 శాతం ఆదాయ లోటు కనిపిస్తోంది. దాంతో దళిత, గిరిజన సంక్షేమం, స్థానిక సంస్థలకు కేటాయింపుల్లో కోతలు పెడుతున్నారు.
కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు ప్రతి ఏడాదీ అంతకు ముందు ఏడాది కన్నా 10, 15 శాతం పెంపుదల చేసినట్లు చూపుతూ ప్రకటిస్తు న్నారు. 2026 జనవరి 28న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఇందుకు తాజా ఉదాహరణ. 2025–26కు రూ. 50 లక్షల కోట్లు ఉండగా, 2026–27కు రూ.53 లక్షల కోట్లకు బడ్జెట్‌ను పెంచారు. గత 2 దశా బ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతున్నది. 2014 ఆగస్టు 17న మోదీ ప్రభుత్వం ప్రణాళికా బోర్డును రద్దుచేసి ‘నీతి ఆయోగ్’ ఏర్పాటు చేసింది. 13వ పంచవర్ష ప్రణాళికా రచనకు విముఖత చూపింది. 1995 నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలు చేయడం వల్ల అనివార్యంగా డబ్ల్యూటీఓ ఆంక్షలకు అనుగుణంగా మన లక్ష్యాలను మరచి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మామూలయ్యింది.
అందువల్ల, 2000 సంవత్సరం నుండి వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తుల్లో ఆశించిన పెరుగుదల లేదు. వ్యవసాయ పరిశోధనలను తగ్గించి వేశారు. విత్తన టెక్నాలజీని ఇతర దేశాల నుండి (మోన్‌శాంటో, డూపాయింట్, సింజెంటా, బేయర్) దిగుమతి చేసుకొని మన వ్యవసాయ పరిశోధనలకు నష్టం కలిగిస్తున్నారు. ఒక దశలో ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు), మాంసం, పాలు, పత్తి, పంచదార, పంటలు ఎగుమతి చేసిన దశ నుండి నేడు దిగుమతి చేసుకున్న దశకు చేరుకున్నాం. అయినా, పాలక వర్గాలు బడ్జెట్లలో తమ లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం లేదు. అందువల్ల, ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా కేంద్రంలోను, రాష్ట్రంలోను ఆర్థిక, సాంఘిక, సామాజిక పెరుగుదలకు అవకాశాలు లేకుండా పోయాయి.
ఎప్పుడూ లోటు బడ్జెటే!
2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా ఆమోదిస్తున్న బడ్జెట్లలో 20–25 శాతం వరకు ఆదాయ లోటు కనిపిస్తోంది. ఫలితంగా దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ, స్త్రీ–శిశు సంక్షేమం, స్థానిక సంస్థలకు కేటాయింపులలో కోతలు పెడుతున్నారు. ఆదాయాన్ని పెంచి చూపడానికి ‘పన్నేతర ఆదాయం’ (నాన్ ట్యాక్స్ రెవెన్యూ),
‘గ్రాంటు’ (కేంద్ర, విదేశీ ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంటు)లను కలిపి వాస్తవ ఆదాయానికి మించి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో 2025–26లో గడిచిన 10 మాసాలలో (ఏప్రిల్ 2025 జన వరి 2026 వరకు) నాన్ ట్యాక్స్ రెవెన్యూ... బడ్జెట్‌లో రూ. 31,618.77 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 7,864.18 మాత్రమే! గ్రాంట్లుగా బడ్జెట్‌లో రూ. 22,782.50 కోట్లు చూపగా... వచ్చిన ఆదాయం రూ.4,213.29 కోట్లు మాత్రమే! పై గణాంకాలు అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక లోనివి.
2026 మార్చి 16 నుండి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నది. ప్రస్తుత బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు కాగా దాన్ని 10–15 శాతం తగ్గించి, 2026–27 బడ్జెట్‌ను 15–20 శాతం పెంపు దల చూపుతారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక–సామాజిక అభివృద్ధిలో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రతి బడ్జెట్‌లో 25 శాతం వడ్డీల కింద చెల్లిస్తున్నట్లు చూపిస్తున్నారు. మిగిలిన నిధులతో ప్రయోజనాత్మకంగా బడ్జెట్‌ను రూపకల్పన చేయాలి. విద్య, వైద్యం, మౌలిక సదుపా యాల కల్పన, చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథ కాలకు తగిన నిధులు కేటాయించి అసలైన అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే సరైన ఫలితాలు ప్రజలకు అందుతాయి.
– సారంపల్లి మల్లారెడ్డి ‘ అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యక్షుడు


