హిమాచల్‌లో 75 మరణాలు.. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ విధింపు | IMD Issued Red Alert To Himachal Pradesh | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో 75 మరణాలు.. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ విధింపు

Jul 6 2025 1:42 PM | Updated on Jul 6 2025 2:42 PM

IMD Issued Red Alert To Himachal Pradesh

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, హిమాచల్‌లోని మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణాల వారి సంఖ్య 75కు చేరుకుంది. మరోవైపు.. పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ విధించింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి  తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి.

రెడ్‌ అలర్ట్‌ జారీ..
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా, సిర్మూర్‌, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్‌ అలర్ట్‌ విధించింది. అలాగే, రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్‌ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్‌పుర్‌, హమిర్‌పుర్‌, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. మరోవైపు.. సహాయక చర్యల్లో ఐటీబీపీ దళాలు పాల్గొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement