హిమాచల్‌ వరదల్లో నలుగురి మృతి | Himachal Pradesh floods kills 4 and some peoples missing | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ వరదల్లో నలుగురి మృతి

Jun 27 2025 5:02 AM | Updated on Jun 27 2025 5:02 AM

Himachal Pradesh floods kills 4 and some peoples missing

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో నలుగురు చనిపోగా సుమారు 20 మంది గల్లంతయ్యారు. కంగ్రా, కులూ జిల్లాల్లో బుధవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా వరదలు వచ్చాయి. 

ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికుల కోసం ఆ సమీపంలోనే తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆకస్మిక వరదల్లో కార్మికుల శిబిరాలు కొట్టుకుపోయాయి. నలుగురు చనిపోగా మరో 15 మందికిపైగా గల్లంతై ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు యూపీకి చెందిన వారున్నారు. కొందరిని రక్షించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎందరనే విషయంలో స్పష్టత లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement