హిమాచల్‌ డిప్యూటీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం | Plane With Himachal Pradesh Deputy CM, DGP Makes Emergency Landing In Shimla, More Details Inside | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ డిప్యూటీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Tue, Mar 25 2025 6:03 AM | Last Updated on Tue, Mar 25 2025 9:00 AM

Plane with Himachal deputy CM, DGP makes emergency landing in Shimla

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి ముకేశ్‌ అగ్నిహోత్రి, ఢిల్లీ డీజీపీ ప్రతుల్‌ వర్మ సహా 30 మంది ప్రయాణికులున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం జుబ్బర్‌హట్టి ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండవ్వకుండా ముందుకు దూసుకెళ్లింది. పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేయడంతో చిట్టచివరి అంచున ఉన్న స్టడ్స్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. దాదాపు అరగంట తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించారు.

 ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. అన్ని తనిఖీల తర్వాతే ఢిల్లీలో విమానం టేకాఫ్‌ తీసుకుందని చెప్పారు. సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతంలో ఉన్న జుబ్బర్‌హట్టి ఎయిర్‌ స్ట్రిప్‌ పొడవు 1,230 మీటర్లు మాత్రమే. పైపెచ్చు ఏటవాలుగా ఉంటుందని చెబుతున్నారు. కాగా, తాజా ఘటనకు దారితీసిన కారణాలపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. విమానంలో సాంకేతిక లోపాలపై ఇంజనీరింగ్‌ సిబ్బంది తనిఖీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement