
అభిప్రాయం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ట్రెండ్ సెట్టర్. నేను రాజ కీయాల గురించి మాట్లాడటం లేదు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గీటు రాయి లాంటి ధరల వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేపట్టిన మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తున్నాను. రసాయన వ్యవసాయం నుండి స్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైవు పరి వర్తన చెందడానికి ఇది కచ్చితమైన మార్గం.
2022 డిసెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించినప్పటి నుండి, పర్వత ప్రాంతంలో సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించడానికి సుఖు చేసిన ప్రయత్నాలను నేను ఆసక్తితో అనుసరించాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సేంద్రియ ఆవు, గేదె పాలకు రూ. 45, రూ. 55 చొప్పున సేకరణ ధర పెట్టారు. ఇది మంచి ప్రారంభం.
ఇటీవలి బడ్జెట్‌లో ఆ ధరలను లీటరుకు మరో ఆరు రూపాయలు రెంటికీ పెంచడం హృద్యం గమం. ఆ తర్వాత ఆయన సేంద్రియ మొక్కజొన్న, గోధుమలను సేకరించడానికి కనీస మద్దతు ధరను వరుసగా కిలోకు రూ. 30, కిలోకు రూ. 40 చొప్పున ప్రకటించారు. మళ్లీ వాటిని రూ. 30 నుండి రూ. 40కి, 40 నుండి రూ. 60కి పెంచారు. అదనంగా, గోధుమలను, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడానికి కిలోకు రెండు రూపాయల రవాణా రాయితీని ప్రకటించారు.
సేంద్రియ సాగుకు ధరే ఊతం
పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించే రైతులకు అధిక ధరలు ప్రకటించడం వల్ల పంట రాబడిలో గణనీ యమైన పెరుగుదలకు వీలు కలుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వ్యవసాయాన్ని ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతుల నుండి పర్యావరణ అనుకూల వ్యవస్థలకు మార్చాలనే ప్రయత్నాలకు ధర ప్రోత్సాహకాలు మరింత ఊతమిస్తాయి.
కొన్ని రోజుల క్రితం, సేంద్రియ పసుపు రైతుల కోసం హిమా చల్ ప్రదేశ్ సీఎం ఒక రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ప్రారంభించారు. సేంద్రియ పసుపునకు కనీస మద్దతు ధర కిలోకు రూ. 90గా నిర్ణయించారు. మార్కెట్ ధర కిలోకు రూ. 25 నుండి రూ. 30 వరకు మాత్రమే ఉంది. ధరలలో గణనీయమైన పెరుగుదల సేంద్రియ పసుపు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
కోవిడ్–19 మహమ్మారి తర్వాత, ప్రజలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలోని ప్రాముఖ్యతను గ్రహించిన తర్వాత, సేంద్రియ పసుపునకు డిమాండ్ పెరిగింది. ముడి పసుపు ప్రాసెసింగ్‌ను రాష్ట్ర సంస్థలు ‘హిమాచల్ హల్దీ’ పేరుతో విక్రయిస్తాయని సుఖు వెల్లడించారు. గతంలో సేంద్రియ మొక్కజొన్న కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా తుది ఉత్పత్తులను ఐదు కిలోలు, 120 కిలోల సంచులలో విక్రయిస్తారు.
2025–26 నాటికి లక్ష మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకు డుగా ముందుకు సాగకపోవడం నాకు సంతోషం కలిగిస్తోంది. హామీ ఇచ్చిన ధరలను అందించడం, ప్రత్యేక ప్రాసెసింగ్‌ను, మార్కెటింగ్‌ను నిర్ధారించడం ద్వారా ప్రభుత్వ మద్దతుతో నెమ్మదిగానే కానీ స్థిరమైన ప్రయత్నం చేయడం అవసరం. కాగితంపై మాత్రమే మిగిలే అసాధ్య మైన లక్ష్యాలను ప్రకటించడం కంటే ఇది చాలా మంచిది.
రాజకీయాలకు అతీతంగా, పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సహజ వ్యవసా యంలో నిమగ్నమైన అనేక వ్యవసాయ సమూహాలు ఇప్పటికే సాను కూల ఫలితాలను చూపిస్తున్నప్పటికీ, తక్కువ మార్కెట్ ధరల కార ణంగా ఈ ప్రయత్నం వీగిపోయింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ పాటించవలసిన ధరల చట్రాన్ని అందించింది. సేంద్రియ సాగుదారులకు అధిక ఆదాయం రావడానికి తక్కువ ఉత్పత్తి ఖర్చుపై ఆధారపడటానికి బదులుగా, తక్షణ అవసరం ఏమిటంటే అధిక హామీ ధరను అందించడం. అంతే తప్ప తక్కువ సాగు ఖర్చు అవస రమనే వాదన పనిచేయదు.
నీతి ఆయోగ్ కూడా సహజ వ్యవసాయ విస్తరణను అభినంది స్తోంది. కానీ సాగుదారులకు ఆకర్షణీయమైన ధర అవసరాన్ని అది విస్మరించింది. అందుకే హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో కొత్తదైన సానుకూల ధోరణిని నేను చూస్తున్నాను. మార్కెట్లు సామర్థ్యాన్ని, నాణ్యతను ప్రోత్సహిస్తాయనే తప్పుడు నమ్మకం ఉన్నప్పటికీ, సేంద్రియ రైతులకు సరైన, హామీ ఇవ్వబడిన ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com