Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు | 20 missing after cloudburst in Himachal Pradesh's Shimla | Sakshi
Sakshi News home page

Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు

Aug 1 2024 9:37 AM | Updated on Aug 1 2024 1:55 PM

20 missing after cloudburst in Himachal Pradesh's Shimla

ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లా రాంపూర్‌ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 50 మంది గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాల్ని హిమాచల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ టీంలు వెలికి తీశాయి. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

గురువారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ కమిషనర్‌ అనురాగ్‌ కశ్యప్‌ వెల్లడించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement