స్కూటీకి రూ. లక్ష... నంబర్‌కు రూ.14 లక్షలు  | Honda Activa owner pays Rs 15 lakh to buy 0001 number | Sakshi
Sakshi News home page

స్కూటీకి రూ. లక్ష... నంబర్‌కు రూ.14 లక్షలు 

Jun 21 2025 4:19 AM | Updated on Jun 21 2025 4:19 AM

Honda Activa owner pays Rs 15 lakh to buy 0001 number

సిమ్లా: బైక్‌ లేదా కారు.. వాహనం ఏది కొ న్నా, రిజిస్ట్రేషన్‌ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్‌ కావాలని కోరుకుంటాం. ఏదైతే ఏముందిలే? అని కొందరనుకుంటే.. ఇష్టమైన నంబర్‌ కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు మరికొందరు. ఈ కోవలోకే వస్తాడు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి వీఐపీ నంబర్‌ హెచ్‌పీ21సీ–0001 కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు.  ఆ నంబర్‌ కోసం వేలంలో ఇద్దరే పాల్గొనడం గమనార్హం.

 సోలన్‌ జిల్లాలోని బడ్డీకి చెందిన ఓ వ్యక్తి రూ.13.5 లక్షలు పాడగా.. హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్‌ కుమార్‌ అతని కంటే ఎక్కువగా రూ.14 లక్షలకు ఆ నంబర్‌ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కూడా ఇదే. తనకు ప్రత్యేకమైన నంబర్లను సేకరించడం ఇష్టమని చెప్పే సంజీవ్‌ కుమార్‌.. ఫ్యాషన్‌ ముందు డబ్బులు లెక్క కాదంటున్నాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం తప్పదని చెబుతున్నాడు.   
 

Advertisement
 
Advertisement
Advertisement