బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్‌కట్‌లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్‌తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్‌గా నిజాయితీగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్ మారడానికి ఎంత టైం పట్టిందంటే..
ఫరాఖాన్ సోహా అలీఖాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఆల్ అబౌట్ హర్ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చేసింది ఫరా.
తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్ నైట్ షిప్ట్‌లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్‌కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె.
అయితే తాము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది. అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.
తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్‌లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్‌గా మారలేదన్నమాట.
(చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!)


