నవంబర్21, 2025న మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.
సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ధరించే ముడివేసిన రిబ్బన్ దేనికోసం నిలబడుతున్నారనేది తెలుపుతుంది. ఎరుపు రంగు ఎయిడ్స్, గుండెజబ్బుల అవగాహనను సూచిస్తుంది. అదే గులాబీ రంగు రిబ్బన్ రొమ్ము కేన్సర్‌ని సూచిస్తుంది. ఇక పసుపు ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. అలా ఇలా కాకుండా సిల్వర్ కలర్ ధరించిన ఫాతిమా దేనికోసం కృషి చేసింది, ఏ అంశంపై అవగాహన కల్పిస్తుంది అంటే..
వెండి రిబ్బన్ ప్రాముఖ్యత..
మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ ధరించిన వెండి రిబ్బన్ స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్, డైస్లెక్సియాతో సహా మెదడు వ్యాధులు, రుగ్మతలు, వెకల్యాలకు మద్దతును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, పరిశోధన, మద్దతు కోసం తన ఫాలోవర్లుకు అవగాహన కల్పించేలా ప్రభావితం చేసేందుకు ఆ రిబ్బన్‌ని ధరించారామె.
అదే ఎందుకంటే..
ఫాతిమా బాస్ పాఠశాలలో ఉన్నప్పుడు డిస్లెక్సియా ADHDతో ఇబ్బంది పడినందున ఆమె ముడి వేసిన వెండి రిబ్బన్‌ను ధరించి కనిపించింది.ఇక ఆమెక చదవు అంటే మహా ఇష్టం. ఆ అభిరుచితోనే జస్ట్ 16 ఏళ్లకే యూఎస్ వెళ్లింది. ఆమె తన కెరీర్‌ని పూర్తిగా ఫ్యాషన్‌కే అంకితం చేసింది. అలాగే కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా కూడా పనిచేస్తుంది. వీక్ ఆఫ్ సమయాల్లో వార్షిక టోయ్ డ్రైవ్‌ని నిర్వహిస్తుందట


