అమెరికాలో కూలిన విమానం.. 8 మంది దుర్మరణం | B 52 Bomber Crashes At US Base In California Full Details | Sakshi
Sakshi News home page

అమెరికాలో కూలిన విమానం.. 8 మంది దుర్మరణం

Jun 16 2026 6:39 AM | Updated on Jun 16 2026 12:16 PM

B 52 Bomber Crashes At US Base In California Full Details

అమెరికా కాలిఫోర్నియా స్టేట్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో  విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

స్థానికకాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 11గం.20ని. సమయంలో ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ నుంచి విమానం టేకాఫ్‌ అయ్యింది. అయితే కాసేపటికే అది ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతి కావడంతో అందులో సిబ్బంది అగ్నికి ఆహుతి అయ్యారు. సాధారణ పరీక్షా మిషన్‌లో భాగంగా బీ-52 బాంబర్‌ బయలుదేరిందని.. ఆ వెంటనే ఈ ఘోరం జరిగిందని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రకటించారు. 

ప్రమాద స్థలానికి అత్యవసర సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఎయిర్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేసి, అక్కడికి వచ్చే ఇతర విమానాలను మళ్లించారు.

ఇఇలా ఉంటే.. 1954లో అమెరికా ఆర్మీలో అడుగు పెట్టిన బీ-52 బాంబర్.. అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో ఒకటి. అణ్వస్త్రాలు సహా వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఈ విమానం అనేక యుద్ధాల్లో సేవలందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement