breaking news
Army helicopter
-
నర్మాలలో ఆర్మీ హెలికాప్టర్ ఆపరేషన్ సక్సెస్.. రైతులు సేఫ్
సాక్షి, సిరిసిల్ల: గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్య్కూ ఆపరేషన్ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకుని ఎత్తైన గడ్డ మీద ఉన్నారు.ఈ క్రమంలో వీరికి డ్రోన్ ద్వారా అధికారులు ఆహారం అందించారు. రైతుల వద్దకు బోట్ల ద్వారా చేరుకోలేమని, హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. మానేరు వరదలో ఇప్పటికే నాగయ్య(50) గల్లంతయ్యాడు. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానికదళ హెలికాప్టర్ పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్ చేరుకుంది. మరోవైపు.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ నర్మాలలో సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు అవసరమైతే మరిన్ని NDRF టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. -
Cheetah Crash: లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం
సాక్షి, యాదాద్రి: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. -
మరో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్: ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ సమీపంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని గౌహతి డిఫెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషాదాన్ని నింపిన ఇటీవలి ప్రమాదం నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని గానం గ్రామం సమీపంలో మిలిటరీ చిరుత హెలికాప్టర్ కూలి పోయిందని తెలిపారు. కాగా అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. Received very disturbing news about Indian Army’s Advanced Light Helicopter crash in Upper Siang District in Arunachal Pradesh. My deepest prayers 🙏 pic.twitter.com/MNdxtI7ZRq — Kiren Rijiju (@KirenRijiju) October 21, 2022 -
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి -
స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి!
యాంగూన్: తిరుగుబాటుదారులు నక్కి ఉన్నారనే అనుమానంతో మయన్మార్ ఆర్మీ హెలికాప్టర్ ఓ స్కూలు భవనంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు సహా 13 మంది చనిపోయారు. సగయింగ్ ప్రాంతంలోని లెటెయెట్ కోన్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. బౌద్ధ ఆశ్రమం ఆవరణలోని 240 మంది విద్యార్థులున్న స్కూలుపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఇందులో 30 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. బాలుని మృతదేహాన్ని తరలిస్తూ తండ్రి కంటతడి గ్రామంలోని 2 వేల మంది ప్రాణభయంతో ఊరొదిలారు. రెబల్స్ కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో వారితో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం తెలిపింది. సైనిక నేతలు గత ఏడాది ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. నేలపై రక్తం. అక్కడ పడున్న స్కూలు బ్యాగు ఇదీ చదవండి: ప్రపంచ నేతలు స్పందించాలి: ఎన్జీవోలు -
కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్‌లోని గజ్రాన్ నల్లాహ్ వద్ద ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అతి దగ్గర్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్, కో-పెలట్ ఉన్నట్లు తెలిపారు. An Indian Army Cheetah helicopter has crashed in the Baraum area of Gurez sector of Jammu and Kashmir. The search parties of the security forces are reaching the snow-bound area for the rescue of the chopper crew. More details awaited: Defence officials pic.twitter.com/LMFunz5c0a — ANI (@ANI) March 11, 2022 ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి మళ్లినట్లు ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో పైలట్ మృతిచెందినట్లు, కో పైలట్ గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే -
Aircraft Crashes: కుప్పకూలిన ఆర్మీ ట్రైనర్ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఆర్మీ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌కు గురవటం కలకలంగా మారింది. ఈ ప్రమాదం బిహార్‌లోని బోధ్ గయా బ్లాక్‌లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్.. ట్రైనింగ్‌లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్ టెకాఫ్‌కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో.. హెలికాప్టర్ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు. #WATCH | An aircraft of the Indian Army’s Officers’ Training Academy in Gaya, Bihar today crashed soon after taking off during training. Both the pilots in the aircraft are safe. Video source: Local village population pic.twitter.com/gauLWCrfxN — ANI (@ANI) January 28, 2022 చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
Captain Varun Singh Passed Away: ఆర్మీహెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా, డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మందిలో 13 మంది అదే రోజు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా! Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) December 15, 2021 IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family. — Indian Air Force (@IAF_MCC) December 15, 2021 -
శ్యామలను బిడ్డలా చూసుకుంటా!
బి.కొత్తకోట: లాన్స్‌నాయక్ బి.సాయితేజ భార్య శ్యా మలను నా బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాటిచ్చారు. కురబలకోట మండలం రేగడివారిపల్లెలో సాయితేజ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. సా యితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరి, తండ్రి మోహన్‌ను ఓదార్చారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధుల్లోనే వీరమరణం పొంది సాయి తేజ తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. ఇంకా ఎంతోస్థాయికి ఎదగాల్సిన సాయి తేజ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అ న్నారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికు లను కోల్పోయామని, మనకే ఎందుకు ఇలా జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తమ కుటుంబమని, ఎవరికీ ఏ కష్టం కలిగినా అండగా ఉంటామన్నారు. శ్యామలను ప్రభుత్వపరంగా వందశాతం ఆదుకుంటామని, వ్య క్తిగతంగా ఎవరూ ఊహించని స్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటా మ ని స్పష్టం చేశారు. సాయితేజను తిరిగి తెచ్చివ్వలేమని చెప్పారు. జ్వరంతోనే పరామర్శ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, సాయితేజ మృతి విషయం తెలుసుకుని అంత్యక్రియలకు సంబంధించిన చర్యలకు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జ్వరం ఉన్నప్పటి కీ రేగడివారిపల్లెకు వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం.. పచ్చబొట్టు ఆధారంగా గుర్తింపు
బి.కొత్తకోట: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ అమరుడై శుక్రవారానికి మూడు రోజులైంది. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన బుధవారం సాయంత్రం నుంచి రేగడపల్లెలో విషాదం అలుముకుంది. సాయితేజ కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు. కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది డీఎన్ఏ పరీక్షల్లో జాప్యం లాన్స్‌నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు. అందరి శ్యాంపిల్స్ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్ ల్యాబ్స్‌లో డీఎన్ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్ తెలిపారు. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. సాయితేజ ఇంట్లో విషణ్ణవదనాలతో కుటుంబసభ్యులు, బంధువులు -
బిపిన్ రావత్ ఓ బ్రాండ్ .. మాజీ కల్నల్ ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మాజీ కల్నల్ పీవీ దుర్గా ప్రసాద్ కొన్నేళ్ల పాటు బిపిన్ రావత్‌తో కలిసి పని చేశారు. ఇద్దరూ కలిసి అనేక కీలక ఆపరేషన్లు కూడా చేశారు. 1978 నుంచి ఇద్దరూ కలిసి ఒకే బెటాలియన్‌లో దాదాపు 18 ఏళ్లు విధులు నిర్వర్తించారు. లెఫ్ట్‌నెంట్ నుంచి కల్నల్ వరకు కలిసే ఎదిగారు. ఆపై దుర్గా ప్రసాద్ పదవీ విమరణ పొందారు. రావత్ సీడీఎస్ వరకు ఎదిగారు. ఈ ద్వయం అమృత్సర్, యూరిల్లో అత్యంత సన్నిహితంగా పని చేసి, అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. బిపిన్ హఠాన్మరణం నేపథ్యంలో దుర్గా ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. నిబద్ధతకు నిదర్శనం.. ► బిపిన్ రావత్‌తో కలిసి 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆల్ఫా కంపెనీలో పని చేశా. ఓ రోజు ఇద్దరం కలిసి యూరి క్యాంప్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గార్డ్ చేస్తూ మధ్యాహ్న భోజనానికి వచ్చాం. అది పూర్తయిన తర్వాత ఎవరో మేజర్ జనరల్ వస్తే ఆయన బ్రీఫింగ్ చేస్తూ నేను ఆగిపోగా... బిపిన్ ఆర్మీ వాహనంలో తన విధులకు వెనక్కు వెళ్తున్నారు. నేను చూస్తుండగానే బాంబు పేలింది. ఆ ప్రమాదంలో ఆయన గాయాలతో బయటపడ్డారు. నాటి దసరా సందర్భంలో గాయాలతో ఉన్నారు. అలాంటి వారికి క్యాంప్ నుంచి వెనక్కు వచ్చే అవకాశం ఉన్నా... ఆయన ఒప్పుకోలేదు. అంతటి నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారాయన. ► దసరా రోజు సాయంత్రం 5.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన ఛగోతీ పోస్టు వద్ద ఉన్నాం. ‘నేను నా ట్రూప్స్‌తో వెళ్లి దసరా బోర్డర్ లైన్ వద్ద సెలబ్రేట్ చేస్తా’ అని వెళ్లారు. దాదాపు రెండుమూడు గంటలు అక్కడ గడిపి వెనక్కు వచ్చారు. ఆయన నడిచే పరిస్థితి లేకపోవడంతో గూర్ఖా ట్రూప్స్ మోసుకు వెళ్లాయి. ఆ రోజు ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా ఇలా చేశాం. అలాంటివి మళ్లీ జరిగి ఉంటాయని అనుకోను. పాకిస్థాన్‌కు చెందిన ఆయుధాలు రికవరీ చేయడం, ఆ బలగాల కదలికల్ని కనిపెట్టడంలో బిపిన్ రావత్‌కు మంచి నెట్వర్క్ ఉండేది. సెకండ్ లెఫ్ట్‌నెంట్ నుంచే ముందుండి ట్రూప్‌ను నడిపే వారు. అందుకే అనేక మెడల్స్ ఆయన సొంతమయ్యాయి. 18 గంటల పాటు పనిచేసేవారు ► రావత్‌కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్ ఇన్సెర్జెన్సీ ఏరియాలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్ రావత్ మాత్రం అలా చేయలేదు. మరో హెలికాప్టర్ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది. ఒక్కోసారి నిర్విరామంగా 18 గంటలూ ఆయన పని చేసే వారు. ఆయన భార్యను మేం మధు అని పిలిచేవాళ్లం. ఆమెది మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకుటుంబం. అయినా ఆ దర్పం గాని, సీనియర్ అధికారి భార్య అనే భావన గాని ఏనాడూ ఆమెలో కనిపించలేదు. లక్నోలో మేమంతా కలిసి ఒకేచోట ఉండేవాళ్లం. నా భార్య అరుణకు ఆమె స్కూటర్ నడపడం నేర్పారు. ► రావత్ ఆర్మీ వైస్ చీఫ్, చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వెళ్లి కలిసేవాడిని. రావత్ సీడీఎస్ అయిన తర్వాత ఒకేసారి కలిశాను. ఏడాది క్రితం ఆయన సీడీఎంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు దాదాపు గంటకు పైగా ఆయనతో గడిపా. బిపిన్ ఆర్మీ ఆపరేషన్స్‌లో దిట్ట. ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఆయన కాంగోలో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పని చేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరూ అభినందించారు. ► బలగాల నైతిక ధైర్యం దెబ్బతీయడానికి యూఎన్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన కాంగో మిలిటెంట్స్‌ను సమర్థంగా తిప్పికొట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ దేశాల ఆర్మీలని ఆయన అధ్యయనం చేశారు బిపిన్. ఈ నేపథ్యంలోనే ఆయన సీడీఎస్ అయిన తర్వాత థియేటర్ కమాండ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న సైన్యానికైనా ఆయుధ, మౌలిక వసతుల కల్పన తేలికైంది. యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అది పూర్తిగా అమలులోకి వచ్చే సందర్భంలోనే విషాదం చోటుచేసుకోవడం దారుణం. చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు -
ఊరే అతడింటికి కదిలొచ్చింది
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్‌నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు. ‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’ తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది. ‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’ ‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు. కాగా తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్‌కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు. -
హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వారికి పార్లమెంట్లో సంతాపం
02: 35 PM ►మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభ 11: 25 AM ► ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాన్ని డీకోడ్ కోసం ఢిల్లీ లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది. 11: 20 AM ► లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దంపతులు, బృందంతో కూడిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు సులూరు నుంచి వెల్లింగ్టన్ బయలుదేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఈ క్రమంలో 12.20 నిమిషాలకు ప్రమాదం జరిగిందనన్నారు.పేలుడు సంభవించినప్పుడు హెలికాప్టర్లో 14 మంది ఉన్నారని.. వీరిలో 13 మంది మృతి చెందారని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు. అమరుల భౌతిక కాయాలు సాయంత్రానికి ఢిల్లీ చేరతాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 11: 05 AM ► తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు.. మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం సభ ప్రారంభమయ్యింది. -
Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో
చెన్నై: తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. అయితే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత ఇలా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ఆకాశంలో ఉన్నప్పుడే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్న కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా అదుపు కోల్పోయి నిటారుగా వేగంగా నేలను ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. కొందరు బయటకు దూకారని చెపుతున్న మాటలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ వీడియో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్దే అని అంతా భావించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఫేక్. ఇది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంంబంధించినది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. తాజాగా కొందరు ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr — Marwadi Club (@MarwadiClub) December 8, 2021 -
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత
కూనూర్: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్ల్యూడబ్లూయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్‌సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్‌నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్‌ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్‌నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్‌నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. చదవండి: Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం! ఇలా జరిగింది... ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. 11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్‌కాలేజీకి చేరాల్సిఉంది. మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్‌ను ఆక్రమించాయని తెలిపారు. కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
Bipin Rawat Wife Madhulika Dies: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
CDS Bipin Rawat Wife Madhulika All Need To Know Died In Helicopter Crash: ఓ వ్యక్తి తను ఎంచుకున్న రంగం.. విధి నిర్వహణలో విజయవంతంగా కొనసాగుతున్నారంటే అందులో జీవిత భాగస్వామి పాత్ర కచ్చితంగా ఉండే ఉంటుంది. భర్తకు భార్య.. భార్యకు భర్త చేదోడువాదోడుగా ఉంటే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం సమతుల్యం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే చిక్కులు ఉండవు. భారత సీడీఎస్ బిపిన్ రావత్- ఆయన భార్య మధులిక రావత్ గురించి వింటే ఈ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి. భారత దేశపు మొట్టమొదటి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్) బిపిన్ రావత్. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. మరి ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి తన కర్తవ్యాన్ని సజావుగా నిర్వహించాలంటే... కుటుంబం నుంచి సహకారం అవసరం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య మధులిక రూపంలో ఆయనకు చక్కని తోడు ఉంది. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు రత్నాల్లాంటి కుమార్తెలు. తాను సైతం... భర్తకు తగ్గ భార్య ఆమె. రావత్ సీడీఎస్‌గా ఉంటే.. ఆయన సతీమణి మధులిక సైతం అమరవీర సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలోని అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏ(ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) అధ్యక్షురాలు ఆమె. వీర నారీల(అమర సైనికుల భార్యలు), వారి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అంతేగాక విధి నిర్వహణలో వీర మరణం పొందిన సైనికులపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల బాగోగులను కూడా ఈ ఎన్జీవో పర్యవేక్షిస్తుంది. సాధికారికతకై కృషి చేస్తూ.. వీర నారీల సాధికారికతకై మధులిక కృషి చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో శిక్షణ ఇప్పిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడేలా అండగా నిలుస్తున్నారు. అంతేగాక ఆరోగ్య అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. ఆఖరి శ్వాస వరకు.. భర్త వెంటే.. సీడీఎస్‌గా ఎల్లప్పుడు బిజీగా ఉంటే బిపిన్ రావత్ తమిళనాడు పర్యటనకు వచ్చారు. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్( Mi-17V-5)లో బుధవారం బయల్దేరారు. అయితే, ఈ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం విదితమే. ఆ సమయంలో భర్తతో పాటు మధులిక కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషాదమేమిటంటే.. చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ మధులిక ఆయన తోడు పంచుకున్నారు. మధులిక మరణం ఆమె కుటుంబ సభ్యులు, ఏడబ్ల్యూడబ్ల్యూఏకు మాత్రమే కాదు.. ఇతరులకు సాయం చేయాలనుకునే గొప్ప గుణాన్ని ఆరాధించగల ప్రతి ఒక్కరికి తీరని లోటు. చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’ -
బిపిన్ రావత్ ప్రయాణించిన MI 17 V5 హెలికాప్టర్ ప్రత్యేకతలు
చెన్నై: తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలి, తీవ్ర విషాదాన్ని మిగిలి్చన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సాంకేతికంగా అడ్వాన్స్డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు. MI 17 V5 హెలికాప్టర్ అన్నింటిలో టాప్ ఎయిర్‌క్రాఫ్ట్ రకం సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు. డిజైన్ చేసిందెవరు? రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ రూపొందించింది? రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్ ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా ► 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి. ► 2008 ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ► 2011 భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుండి సేవలు. చదవండి: హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్లో ప్రకటన ముఖ్యాంశాలు.. ► ఎంఐ–17వీ5.. హెలికాప్టర్ ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు. ► సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి. చదవండి: ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రమాణించింది వీరే.. MI 17 V5 ప్రత్యేకతలు ► ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి. ► గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ► 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు. ► రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు. ► గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి. ► కొన్ని రోజుల క్రితం తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ► 2018 ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూలిపోయింది. ఇందులోని ఆరుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ► 2017 అక్టోబర్ 7న చైనా సరిహద్దు వైపు వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో నేలకూలింది. మొత్తం ఏడుగురు మృతిచెందారు. ► 2013 జూన్ 15న ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యల్లో పాల్గొని కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ► 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు ఎంఐ–17వీ5 హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. 9 మంది వైమానిక దళం జవాన్లు మరణించారు. చదవండి: బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
కెన్యాలో హెలికాప్టర్ కూలి 17 మంది సైనికులు మృతి
నైరోబి: కెన్యాలో ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో 17 మంది సైనికులు చనిపోయారు. గురువారం ఉదయం 23 మంది సైనికులతో బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కజియాడో కౌంటీలోని ఒలె– తెపెసి వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాతపడగా తీవ్రంగా గాయాల పాలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలిం చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. హెలికాప్టర్ కూలిన విషయాన్ని కెన్యా సైన్యం కూడా ధ్రువీకరించింది. వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. -
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 11మంది మృతి
అంకారా : ప్రమాదవశాత్తు మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన టర్కీలోని టట్వాన్లో గురువారం చోటుచేసుకుంది. హెలికాప్టర్ టట్వాన్నుంచి బింగోల్ వెళుతున్న నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో లెఫ్టినెంట్ జెనర్ ఒస్మానా ఎర్బాస్, ఆర్మీకాప్ కమాండర్లు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్న వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై యురోపియన్ యూనియన్, అమెరికాలు తమ సంతాపం తెలియజేశాయి. -
ఆర్మీ చేతక్ హెలికాఫ్టర్ ఎమెర్జేన్సీ ల్యాండింగ్
-
ఆప్ఘనిస్తాన్‌లో కూలిన హెలికాప్టర్ 25 మంది మృతి
-
రాకెట్లతో ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత
-
ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత: 8 మంది దుర్మరణం
కాబుల్: తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో అఫ్ఘానిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-16 యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. పైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. తాలిబన్ల ఆధిపత్యంలోని బగ్లామ్ ఫ్రావిన్స్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ఆదివారం ఆర్మీ అధికారులు ప్రకటించారు. బగ్లామ్ సహా కొన్ని ఉత్తర ప్రాంతంలు చాలా ఏళ్లుగా తాలిబన్ల ఆధిపత్యం కిందే కొనసాగుతున్నాయి. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోన్న తాలిబన్లను అంతం చేసేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. కొద్ది రోజుల కిందటే యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే భూతలంలో పోరాడుతున్న సైనికులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తోన్న హెలికాప్టర్ ను ఉగ్రవాదులు పేల్చేశారు. హెలికాప్టర్ గాలిలోనే పేలిపోవడంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని అధికారులు పేర్కొన్నారు. -
బందీపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
బందీపూర్: సైనిక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి బుధవారం సాయంత్రం జమ్మూకశ్మీర్ లోని బందీపూర్ లో కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించివుంటారని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు. ఆకాశం నుంచి ఏదో కిందకు పడడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. -
కూలిన ఆర్మీ చాపర్, ముగ్గురు మృతి
బలేరియా : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బరేలీ సమీపంలో కంటోన్మెంట్ ఏరియాలో ఈ చాపర్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లతో సహా ఓ ఇంజినీర్ అ అక్కడికక్కడే మరణించారు. టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాంతో వెంటనే మంటలు చెలరేగి, ఎయిర్ బేస్‌లో కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.