మరో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌: ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి

Army Chopper Crashes Near Migging in Arunachal Pradesh Rescue Ops Underway - Sakshi

ఈటానగర్‌: అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ సమీపంలో అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.  రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని గౌహతి డిఫెన్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.    విషాదాన్ని నింపిన ఇటీవలి ప్రమాదం నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. 

అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని గానం గ్రామం సమీపంలో మిలిటరీ చిరుత హెలికాప్టర్‌ కూలి పోయిందని తెలిపారు. కాగా అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సమీపంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో  ఒక  పైలట్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన  సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top