ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత: 8 మంది దుర్మరణం | army helicopter shot down by Talibans in Afghanistan | Sakshi
Sakshi News home page

ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత: 8 మంది దుర్మరణం

Oct 9 2016 11:13 AM | Updated on Sep 4 2017 4:48 PM

ఎంఐ-16 హెలికాప్టర్(ఫైల్ ఫొటో)

ఎంఐ-16 హెలికాప్టర్(ఫైల్ ఫొటో)

తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో అఫ్ఘానిస్థాన్ ఆర్మీకి చెందిన యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. పైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

కాబుల్: తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో అఫ్ఘానిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-16 యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. పైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. తాలిబన్ల ఆధిపత్యంలోని బగ్లామ్ ఫ్రావిన్స్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ఆదివారం ఆర్మీ అధికారులు ప్రకటించారు.

బగ్లామ్ సహా కొన్ని ఉత్తర ప్రాంతంలు చాలా ఏళ్లుగా తాలిబన్ల ఆధిపత్యం కిందే కొనసాగుతున్నాయి. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోన్న తాలిబన్లను అంతం చేసేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. కొద్ది రోజుల కిందటే యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే భూతలంలో పోరాడుతున్న సైనికులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తోన్న హెలికాప్టర్ ను ఉగ్రవాదులు పేల్చేశారు. హెలికాప్టర్ గాలిలోనే పేలిపోవడంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement