Myanmar: స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి!

Myanmar Army Helicopter Fire On School Thirteen Died - Sakshi

యాంగూన్‌: తిరుగుబాటుదారులు నక్కి ఉన్నారనే అనుమానంతో మయన్మార్‌ ఆర్మీ హెలికాప్టర్‌ ఓ స్కూలు భవనంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు సహా 13 మంది చనిపోయారు. సగయింగ్‌ ప్రాంతంలోని లెటెయెట్‌ కోన్‌ గ్రామంలో  ఈ దారుణం జరిగింది. బౌద్ధ ఆశ్రమం ఆవరణలోని 240 మంది విద్యార్థులున్న స్కూలుపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఇందులో 30 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.

బాలుని మృతదేహాన్ని తరలిస్తూ తండ్రి కంటతడి

గ్రామంలోని 2 వేల మంది ప్రాణభయంతో ఊరొదిలారు. రెబల్స్‌ కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో వారితో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం తెలిపింది. సైనిక నేతలు గత ఏడాది ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి.

నేలపై రక్తం. అక్కడ పడున్న స్కూలు బ్యాగు

ఇదీ చదవండి: ప్రపంచ నేతలు స్పందించాలి: ఎన్‌జీవోలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top