ఖతార్‌లో కూలిన సైనిక హెలికాఫ్టర్‌ | Six diese in Qatar helicopter crash due to technical malfunction | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో కూలిన సైనిక హెలికాఫ్టర్‌

Mar 22 2026 3:49 PM | Updated on Mar 22 2026 4:48 PM

Six diese in Qatar helicopter crash due to technical malfunction

దోహ: ఖతార్‌ సైనిక హెలికాఫ్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం.

ఖతర్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, సాధారణ విధుల్లో ఉన్న ఒక సైనిక హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా దేశపు సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ఎటువంటి సంబంధం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదానంతరం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి వివరాల గురించి తెలియాల్సి ఉంది.  

 


 

Advertisement
 
Advertisement
Advertisement