సౌత్‌ కరోలీనా లిటిల్‌ రివర్‌లో కాల్పులు | South Carolina Memorial Day Shooting Updates | Sakshi
Sakshi News home page

సౌత్‌ కరోలీనా లిటిల్‌ రివర్‌లో కాల్పులు.. 11 మందికి గాయాలు

May 26 2025 10:27 AM | Updated on May 26 2025 11:14 AM

South Carolina Memorial Day Shooting Updates

కొలంబియా: అమెరికా రాష్ట్రం సౌత్‌కరోలీనా(South Carolina) తుపాకీ మోతలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. లిటిల్‌ రివర్‌ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మైర్టెల్‌ తీరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది లిటిల్‌ రివర్‌(Little River) నగరం. ఆదివారం రాత్రి మెమోరియల్‌ డే సందర్భంగా పలువురు గుమిగూడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో పలువురు గాయపడినట్లు, ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రులకు చేరినట్లు హోరీ కౌంటీ పోలీసులు(Horry County Police) వెల్లడించారు. క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు కాల్పులకు పాల్పడింది ఎవరు? అనుమానితుడికి సంబంధించిన వివరాలను సైతం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే.. ఘటనా స్థలానికి పోలీసు వాహనాలు, ఆంబులెన్స్‌లు వెళ్లిన దృశ్యాలు మాత్రం మీడియాలో కనిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: పుతిన్‌కు పిచ్చి.. నోరు జాగ్రత్త జెలెన్‌స్కీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement