ట్రంప్‌కు సొంత ప్రజల నుంచి మరో షాక్‌..! | Most Americans want new US Congress to end Donald Trump Iran war, tariffs | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు సొంత ప్రజల నుంచి మరో షాక్‌..!

Nov 10 2026 7:16 PM | Updated on Nov 10 2026 7:22 PM

Most Americans want new US Congress to end Donald Trump Iran war, tariffs

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రజల నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలంగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని, ట్రంప్‌ విధించిన దిగుమతి సుంకాలను రద్దు చేయాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నట్లు రాయిటర్స్‌-ఇప్సోస్‌ సర్వే వెల్లడించింది.

ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ భారీ మెజారిటీ సాధించారు. దాంతో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కొత్త కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేలా కాంగ్రెస్‌ చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది డెమొక్రాట్లు, తర్వాత స్థానంలో రిపబ్లికన్లు ఉన్నారు.

అలాగే ట్రంప్‌ ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలను కూడా రద్దు చేయాలని 62 శాతం మంది కోరుకున్నారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, దిగుమతి సుంకాలతో నిత్యావసరాల ధరలు అధికమవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొత్త కాంగ్రెస్‌ తొలి 100 రోజుల్లో జీవన వ్యయాన్ని తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇక మరోవైపు ట్రంప్‌ను అభిశంసించే ప్రయత్నం దేశానికి మంచిది కాదని 42 శాతం మంది పేర్కొనగా.. 33 శాతం మంది దానికి మద్దతు తెలిపారు. ట్రంప్‌ ఆమోద రేటింగ్‌ 32 శాతానికి పడిపోయినట్లు సర్వే వెల్లడించింది. డెమొక్రాట్లకు 45 శాతం, రిపబ్లికన్లకు 35 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. అమెరికా దేశ వ్యాప్తంగా 1,705 మంది పెద్దల నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించినట్టు సమాచారం.

ఇదీ చదవండి: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే ఉరిశిక్ష తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement