ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న విజువల్స్‌లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్‌లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్ పైన నిల్చున్న దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.
#இந்தோனேசியா தலைநகர் #ஜகார்த்தா-வில் வணிக கட்டிடம் ஒன்றில் இன்று ஏற்பட்ட தீ விபத்தில் 5 பெண்கள், 15 ஆண்கள் என குறைந்தது 20 பேர் பலியாகியுள்ளனர்.#indonesia #jakarta #FireAccident pic.twitter.com/yh9wKi6V0G
— patrikai.com (@Patrikaidotcom) December 9, 2025
ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు.


