నెతన్యాహు ఎక్కడ? | Internet claims recent viral video of Israeli PM AI-generated as it shows 6 fingers | Sakshi
Sakshi News home page

నెతన్యాహు ఎక్కడ?

Mar 15 2026 2:18 AM | Updated on Mar 15 2026 12:54 PM

Internet claims recent viral video of Israeli PM AI-generated as it shows 6 fingers

ఇజ్రాయెల్‌ ప్రధాని మరణించారని వదంతులు 

ఏఐ వీడియోలతో దాస్తున్నారంటూ వార్తలు 

ఆరో వేలు దృశ్య భ్రాంతే: గ్రోక్‌ ఫ్యాక్ట్‌ చెక్‌

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు, పుకార్లతో శనివారం సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్‌ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నింటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్‌పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెలీలను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లున్నట్టుగా కన్పించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్‌ లభించాయి. వాస్తవానికి నెతన్యాహు రెండు చేతులకూ ఐదు వేళ్లే ఉంటాయి.

దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచి్చంది. దానిపై రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జెనరేటెడ్‌ వీడియో అని నెటిజన్లు అనుమానం వెలిబుచ్చారు. మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్‌ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్‌ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కన్పించారు. ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధం మధ్యలో ఆ విషయం బయటికొస్తే ఇరాన్‌కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్‌ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటినుంచీ ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గానీ కుడి చేతికి ఆరు వేళ్లు వాస్తవం కాదని గ్రోక్‌ తేల్చింది. ఒకానొక ఫ్రేమ్‌లో నిర్దిష్ట కోణంలో అరచేతికి ఆరో వేలున్నట్టు కేవలం దృశ్యభ్రాంతి కలుగుతోందని పేర్కొంది.

అయినా ఆన్‌లైన్‌ రగడకు తెర పడకపోవడం విశేషం! ‘నెతన్యాహు ఎక్కడ?’, ‘బిబి (నెతన్యాహు ముద్దుపేరు) క్షేమమేనా?’అంటూ సోషల్‌ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా శుక్రవారం నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్‌హౌస్‌లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్‌ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి ‘అత్యవసర’పిలుపు రావడంతో ఉన్నపళంగా ‘సిచ్యుయేషన్‌ రూమ్‌’కేసి పరుగెత్తారు. ఏకంగా రెండు గంటల అనంతరం తిరిగొచ్చారు.

తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించినా బెసెంట్‌లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. ‘‘నెతన్యాహు ఇక లేరని బహుశా ట్రంప్‌కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్‌తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చు’’అని సోషల్‌ మీడియా యూజర్లు విశ్లేíÙస్తున్నారు. ప్రఖ్యాత రాజకీయ వ్యాఖ్యాత జోహనస్‌ ఎం.కొన్రాడ్త్‌ కూడా నెతన్యాహు మరణించారని సదరు వీడియోను ఉటంకిస్తూ పేర్కొనడం విశేషం. ఆ విషయం తెలియడం వల్లే బెసెంట్‌ అంతగా దిగ్భ్రాంతికి లోనైనట్టు కన్పించారని ఆయన కూడా చెప్పుకొచ్చారు.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement