
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?. కేవలం 2, 44,000 మెట్రిక్ టన్నులు మాత్రమే!.
అవును.. ఈ భూమ్మీద బంగారు గనుల నుంచి 244,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే గనుల నుంచి బయటకు వెలికి తీయబడింది. ఇందులో ఎక్కువగా.. చైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి వెలికి తీసిందే. అయితే.. ఇంత బంగారాన్ని ఒకవేళ భూమ్మీద ఉన్న మనుషులందరికీ పంచగలిగితే!..
భూమ్మీద అధికారికంగా ఇప్పుడున్న ప్రతీ మనిషికి బంగారం గనుక పంచితే(Gold Distribution On Earth).. దాదాపు 30 గ్రాముల(ట్రాయ్ ఔన్స్) దాకా పంచొచ్చట. ప్రపంచ జనాభా.. 816 కోట్లుగా ఓ అంచనా వేసుకుంటే.. ఈ బంగారం ఇలా సరిపోతుందని విజువల్ క్యాపిటలిస్ట్‌కు చెందిన వోరోనోయి యాప్ లెక్కకట్టి తేల్చింది.

👉అయితే.. అత్యధిక బంగారు నిల్వలు(Gold Reserves) ఉన్నది మాత్రం అమెరికాలో. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్న చైనా.. తన నిల్వలను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. బంగారు నిల్వల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది.
👉ఒకప్పుడు బంగారం ఉత్పత్తి(Gold Production) అంటే.. దక్షిణాఫ్రికా పేరు ప్రముఖంగా వినిపించేది. 1900-1970 మధ్య ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచిందది. ఒకానొక టైంలో ఏడాదికి 1,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రారాజుగా వెలుగొంది. అయితే.. ఇప్పుడు బంగారం ఉత్పత్తిలో చైనా అద్భుతాలు సృష్టిస్తోంది.
👉అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారీ బంగారు గనులు లేకపోయినా ఉన్న గనుల నుంచే అత్యధికంగా బంగారాన్ని వెలికి తీస్తోంది. కిందటి ఏడాదిలో రికార్డు స్థాయిలో 380 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బయటకు తీసి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment