వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్‌! | Austrian Alps Plane Hits Paraglider Mid Air video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్‌!

May 25 2026 10:10 AM | Updated on May 25 2026 10:22 AM

Austrian Alps Plane Hits Paraglider Mid Air video Viral

ఆస్ట్రియాలోని ఆల్ప్స్‌ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్‌ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్‌ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి.  

ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్‌ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్‌గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్‌ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్‌హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. 

వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్‌తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్‌లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్‌ ఆమ్‌ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్‌(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement