మిలిటరీ కుటుంబాలపైనా ఇమ్మిగ్రేషన్‌ దాడులు | Trump immigration crackdown ensnares families of US troops | Sakshi
Sakshi News home page

మిలిటరీ కుటుంబాలపైనా ఇమ్మిగ్రేషన్‌ దాడులు

Aug 6 2026 6:23 AM | Updated on Aug 6 2026 6:23 AM

Trump immigration crackdown ensnares families of US troops

 ట్రంప్‌ సర్కారు నిర్వాకం 

సర్వీస్‌లో ఉన్నవారినీ వదల్లేదు  

తల్లిదండ్రులు, భార్య,భర్తల అరెస్ట్‌

వాషింగ్టన్‌: అక్రమ వలసదారులపై చర్యల పేరుతో డొనాల్డ్‌ ట్రంప్‌ చేపడుతున్న చర్యలు వింత పోకడలకు పోతున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జరిపిన పలు దాడుల్లో అక్రమ వలసదారులు మాత్రమే కాకుండా సర్వీసులో ఉన్న మిలిటరీ వాళ్ల కుటుంబ సభ్యులు కనీసం యాభై మంది ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ నిర్వహించిన పరిశోధన తెలిపింది. 

అరెస్ట్‌ అయిన వారిలో మిలటరీ అధికారుల తల్లిదండ్రులు, భార్యలు ఉండగా వీరిలో ఆరుగురిని వారి స్వదేశాలకు తిప్పి పంపారని, ఎనిమిది మంది కస్టడీలో ఉన్నారని ఈ పరిశోధన బయటపెట్టింది. సాధారణంగా మిలటరీ అధికారుల కుటుంబాలకు ఇలాంటి విషయాల్లో రక్షణ ఉంటుంది కానీ ట్రంప్‌ కొత్త విధానాల కారణంగా ఇప్పుడు వారిపై కూడా ఇమ్మిగ్రేషన్‌ దాడులు, కేసులు నమోదవుతున్నాయి.  

గత ఏడాది ఏప్రిల్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఒక ప్రకటన చేస్తూ మిలటరీలో పనిచేస్తున్నారన్న ఒకే కారణం వల్ల వారి బంధువులు ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను ఉల్లంఘించడం నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. ఆర్మీ సార్జెంట్‌ హెదర్‌ టుర్కియోస్‌ జునెజ్‌ భార్యను సంతానం ముందే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారని, వాయుసేన టెక్నికల్‌ సార్జెంట్‌ వెంటీ జిబీవ్‌ తండ్రిని మెక్సికో తిప్పి పంపారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది.  

జనవరి 2025 నుంచి జనవరి 2026 మధ్యకాలంలోనే డీహెచ్‌ఎస్‌ 125 మంది రిటైర్‌ అయిన మిలటరీ వారిని, 150 కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుందని సమాచారం. వీరిలో కొంతమందిని అమెరికా నుంచి బయటకు పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement