లక్నో: అబ్బే ఇవ్వేం అయ్యే పనుల్లా కనిపించట్లేదే. పైగా.. ఫిజికల్‌గాను,మెంటల్‌గాను స్ట్రెయినూ,ఎవర్రా మీరంతా, నువ్వురా ఫ్రెండ్ అనే మీమ్ సోషల్ మీడియాలో కామన్ . కానీ ఇప్పుడు హెడ్‌క్వార్టర్స్ అనే సరికొత్త మీమ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.
మార్కెట్‌లోకి సరికొత్త ‘మీమ్ గాడ్' వచ్చేశారు! "నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా" అన్న రేంజ్‌లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒంటిచేత్తో ఊపేస్తున్నారు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు.. సినిమా స్క్రీన్ నుంచి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ గ్రౌండ్ వరకు.. ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్సే వినబడుతున్నాయి.ఇంతకీ నెటిజన్లను ఇంతలా పిచ్చెక్కిస్తున్న ఆ 'యాక్సిడెంటల్ మీమ్ గాడ్' ఎవరో కాదు.. ప్రముఖ సినీ నటుడు, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ రవి కిషన్. ఈ వైరల్ క్రేజ్‌పై ఆయన స్పందిస్తూ.. అయ్యో.. ఆ మహాదేవుడి మీద ఒట్టు, నేనెందుకు ఇంతలా వైరల్ అవుతానో నాకే తెలియదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘ది అలయన్స్’షో.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ సునామీ!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల వచ్చిన ది అలయన్స్ రియాలిటీ షోతోనే ఈ మీమ్స్ కథ మొదలైంది. రవి కిషన్ తన కుమార్తె రివా కిషన్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే, తన నియోజకవర్గంలో పనుల కారణంగా ఆయన ఈ షో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆయన సెలవు తీసుకుంటూ.. తనకు దేశ సేవ కోసం హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే వెళ్లాలని చెప్పిన స్టైల్ మీమర్ల చేతికి చిక్కింది. దీనికి తోడు, అదే షోలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనబోయి పొరపాటున హోమ్ ఫ్రమ్ వర్క్ అని ఆయన అనడం ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేసింది. ఈ రెండు క్లిప్పింగులు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి.
సరిహద్దులు దాటిన క్రేజ్.. రవి కిషన్ డైలాగ్స్‌కు ఫుట్‌బాల్ స్టార్స్ స్టెప్పులు!
రవి కిషన్‌కు లభించిన ఈ మీమ్ పాపులారిటీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.గ్లోబల్ లెవెల్‌కు రీచ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఆడియో ఎంతలా వైరల్ అయిందంటే.. యూరప్‌లోని ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్బులు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరాయి!.ఇటలీకి చెందిన ఐకానిక్ క్లబ్ జువెంటస్ జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ బోరుస్సియా డార్ట్‌మండ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో రవి కిషన్ డైలాగ్స్‌ను ఉపయోగించుకున్నాయి.
Lord Ravi Kishan supremacy 🗿😎😭❤️
JUVENTUS really posted Ravi Kishan 😭🖤🤍
One of the biggest and most successful football clubs in Italy and Europe. Lord Ravi Kishan supremacy. pic.twitter.com/dzYplDzGvp— 𝙅𝙍𝙅49 (@jrj_49) August 4, 2026
ఈ క్లబ్బులు తమ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియోలు, గోల్స్ కొట్టిన విజువల్స్‌కు రవి కిషన్ హెడ్‌క్వార్టర్స్,హోమ్ ఫ్రమ్ వర్క్ ఆడియోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేశాయి. జువెంటస్ క్లబ్ ఒక అడుగు ముందుకేసి, రవి కిషన్‌కు సంబంధించిన మోస్ట్ పాపులర్ వైరల్ క్లిప్స్ అన్నింటినీ కలిపి ఒక క్రేజీ కంపైలేషన్ వీడియోను విడుదల చేసింది. ఒకే ఒక్క మీమ్ దేశీయ సెలబ్రిటీని గ్లోబల్ ఐకాన్‌గా ఎలా మార్చగలవో చెప్పడానికి ఈ హెడ్‌క్వార్టర్స్ ట్రెండే ఒక సూపర్ ఎగ్జాంపుల్!


