భవనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశా పర్యటనలో ప్రత్యేక రైలులో ప్రయాణించారు. వర్షాకాలంతో పాటు ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భువనేశ్వర్ నుండి బరంపురం వరకు సుమారు 170 కి.మీ మేర ఆమె ఈ రైలు ప్రయాణం సాగించారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి రైలు ప్రయాణం కోసం అరుదైన భద్రత కల్పించారు.
ఈ ప్రత్యేక రైలు మెుత్తం 10 బోగీలను కలిగి ఒక అల్ట్రా-లగ్జరీ సెలూన్ కోచ్‌ను కలిగి ఉంది. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, లివింగ్-కమ్-డైనింగ్ రూమ్, అత్యాధునిక వంటగది వంటి సకల సౌకర్యాలు దీని సొంతం. రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ రైలు వెళ్లేటప్పుడు దాని ముందు ఒక ప్రత్యేక రైలు, వెనుక మరో రైలు భద్రతగా నడిచాయి. ఒక స్టాండ్‌బై రైలూ సిద్ధంగా ఉంచారు. ప్రయాణ సమయంలో, మొత్తం రైల్వే ట్రాక్‌ను ఖాళీ చేయించి ఆ లైన్‌పై ఇతర రైళ్లను అనుమతించలేదు.
ఎందుకు రైలు మార్గం
రాష్ట్రపతి పర్యటన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, హెలికాప్టర్ లేదా విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. రోడ్డు లేదా వైమానిక మార్గాలతో పోలిస్తే, రైలు ప్రయాణంలో ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేయడం సులభం.
భారతదేశంలో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కాలం నుండి రాష్ట్రపతులు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగానే ద్రౌపదీ ముర్ము అప్పుడప్పుడు రైలు ప్రయాణాలను ఇష్టపడుతుంటారు.
VIDEO | President Droupadi Murmu on Tuesday undertook a 170-km-long train journey from Bhubaneswar to Berhampur in Odisha’s Ganjam district on the second day of her visit to the state.
President Murmu will visit Taptapani (Maa Kandhuni Devi) Temple in Berhampur.
(Source: CMO)… pic.twitter.com/edvb8rbmD7— Press Trust of India (@PTI_News) August 4, 2026


