సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాలు పెద్దఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా ఈ నెల 13తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చించేలా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదివరకే లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు, 2026 పై చర్చ ఈ ఏడాది ఏప్రిల్ 16న జరిగింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే మెుదటి నుంచి జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఉత్తరాది రాష్ట్రాల (UP, బీహార్) సీట్లు రాజకీయ బలం భారీగా పెరుగుతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దానితో పాటు మహిళా రిజర్వేషన్‌తో లింక్ పెట్టడంతో మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుతమున్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బిల్లులు ప్రత్యేక మెజారిటీ లేక చట్టసభలలో వీగిపోయాయి.


