సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురయ్యింది. దీంతో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గాయాలయ్యాయని అది మినహా ప్రయాణికులు, సిబ్బంది సేఫ్ అని విమానయాన సంస్థ ప్రకటించింది. పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. అయితే విమానం ఎందుకు కుదుపులకు గురయింది అనే విషయం తెలియాల్సి ఉంది.


