ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో క్రేజ్ ఉండనే ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఓ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత)
'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ లేటెస్ట్ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. గతంలో 'ఉన్ని ముకుందన్ అసోసియేట్స్' అనే డార్క్ కామెడీ మూవీ తీసిన అభినవ్ సుందర్ నాయక్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ నెల 5న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
మాలీవుడ్ టైమ్స్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి హారర్ నవల్స్ చదివి, హారర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ, మనోజ్ నైట్ శ్యామలన్,స్పీల్‌బర్గ్ లాంటి దర్శకులని మించిపోవాలని ఓ కుర్రాడు ఆశపడుతుంటాడు. అలాంటివాడు.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన కథని, తన ఆలోచనల్ని వేరొకడు తెరపై ముందే ప్రెజెంట్ చేసేసినప్పుడు తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడిగా తన ప్రతిభ మాత్రమే తెరపై కనపడాలనుకుని కోరుకునే కుర్రాడు ఎలా ఫీలయ్యాడు? ఏం చేశాడనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్)
A love-hate letter to Malayalam cinema. Mollywood Times streaming from July 3, only on JioHotstar.
Watch in Malayalam, Tamil. Telugu, Kannada and Hindi.@naslen__ @abhinavsnayak #MollywoodTimes #JioHotstar #JioHotstarMalayalam #Drama #Comedy #MalayalamMovie pic.twitter.com/8dNZEhtgSO— JioHotstar Malayalam (@JioHotstarMal) June 26, 2026


