మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత | Singer Sunitha Comments about Feminism and Dress sense | Sakshi
Sakshi News home page

Singer Sunitha: 'మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం'

Jun 25 2026 6:30 PM | Updated on Jun 25 2026 7:03 PM

Singer Sunitha Comments about Feminism and Dress sense

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత మహిళలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఫెమినిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నా బాడీ.. నా హక్కు అన్నప్పుడు మీ ఇష్టమైన దుస్తులు ధరించవచ్చని సునీత తెలిపింది. మిమ్మల్ని ఎవరు చూడలేదని మీకు అనిపించినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్న తప్పులేదన్నారు. అదే సమయంలో అవతలి వ్యక్తి కళ్లు.. అతని ఇష్టమని పేర్కొన్నారు. అవతలివాళ్లు మిమ్మల్ని చూడడంలో ఎలాంటి తప్పులేదని సునీత అన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి కూడా ఆమె ఇంటర్వ్యూలో చర్చించారు.

సునీత మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీలో నో చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అలా చెబితే ఇక్కడ అవకాశాలు రావడం చాలా అరుదు. ఈ విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. ఇంతకుమించి నేను ఎక్కువ ఆశించలేదు. ఇదే మన లైఫ్‌ అనుకుంటే సమస్యలు వస్తాయి. సింగర్‌ అవకాశాలు రాకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటా. మహిళలు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చు. తప్పులేదు.. కానీ అవతలి వ్యక్తులను నువ్వు ఎంతమందిని మారుస్తారు. మీకు నచ్చిన దుస్తులు ధరించండి.. కానీ దానిని స్వేచ్ఛ.. హక్కు అని పిలవకండి. అవతలి వ్యక్తులను మార్చడం కంటే మనల్ని మార్చుకోవడం చాలా సులభం. సమాజంలో మహిళను చూసే పరిస్థితి చాలా దారుణం. ఇక్కడ మాటలు, చూపులతోనే హార్ట్ చేస్తారు. ఎవరు కూడా ఇక్కడ మహిళల మాటకు విలువ ఇచ్చిన సందర్భాలు నేను చూడలేదు'  అని అన్నారు. 

మహిళలు ధరించే దుస్తులకు, ఫెమినిజంకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ సునీత అన్నారు. ఇక్కడ మన సమాజంలో ఆడ, మగ రెండు పూర్తిగా విభిన్నమైన జాతులని ఆమె తెలిపారు. సినీ ఇండస్ట్రీ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని.. తాను 18 ఏళ్లకే అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కొన్నానని వెల్లడించారు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement