టాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇలా జరగడానికి హీరోలు కారణమా? దర్శకులు లేదా పరిస్థితులు కారణమా అనే సంగతి పక్కనబెడితే ఆలస్యం మాత్రం జరుగుతోంది. ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ వర్కింగ్ స్టైల్ ఫాలో అయితే గనక తెలుగు హీరోలు ఈ వాయిదాల్ని కచ్చితంగా అధిగమించొచ్చు. నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
(ఇదీ చదవండి: నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో)
'విజయ్ ఓ సినిమా కోసం 100 రోజుల కాల్ షీట్ కేటాయిస్తారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 20 తేదీ వరకు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. అలా వరసగా ఐదు నెలల్లో మూవీ పూర్తి చేస్తారు. నెలలో మిగిలిన రోజులు విశ్రాంతి తీసుకోవడం, స్టోరీ డిస్కషన్స్, డబ్బింగ్, ప్రమోషన్స్ లాంటి వాటి కోసం వినియోగిస్తారు. ఇలా కచ్చితమైన షెడ్యూల్స్ వల్ల మూవీ టీమ్‌కి చాలా ప్లస్ అవుతుంది. విజయ్ కాల్ షీట్స్ ముందే ఫిక్స్ అయిపోతాయి కాబట్టి షూటింగ్ లొకేషన్స్, మిగతా నటీనటులు కాల్ షీట్స్, టెక్నికల్ అంశాల సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే విజయ్ వర్కింగ్ స్టైల్.. ఇండస్ట్రీలోనే ఆదర్శం. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఇలానే చేసేవారు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
స్వతహాగా తెలుగు నిర్మాత అయిన దిల్ రాజు.. వారిసు(తెలుగులో 'వారసుడు')తో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. రూ.200-250 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది.
(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)


