నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో | Jabardasth Fame Comedian Mahesh Latest Video | Sakshi
Sakshi News home page

Jabardasth Mahesh: ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు

Jun 26 2026 9:15 PM | Updated on Jun 26 2026 9:15 PM

Jabardasth Fame Comedian Mahesh Latest Video

'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని రంగస్థలం, మహానటి తదితర సినిమాల్లో మంచి పాత్రలు చేసిన మహేశ్.. రీసెంట్‌గా 'సింగ్ గీతం'లోనూ నటించాడు. ఇదంతా పక్కనబెడితే మరి ఏమైందో ఏమో సడన్‌గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను నిజం చెప్పేవరకు ఎవరు ఏం రాయొద్దని అన్నాడు.

'లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరకు ఏమవుతుందో తెలీదు. మనం బయట చూసిన దానిబట్టి ఏవేవో ఊహించుకుని నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను నిజం చెప్పేవరకు మీరు అనుకున్నది రాయొద్దు. త్వరలో మొత్తం నేనే మీకు నిజం చెబుతాను' కమెడియన్ మహేశ్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)

అయితే మహేశ్ చెబుతున్నది తన జీవితం గురించా? లేదంటే కొత్త సినిమా ప్రమోషనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య పలువురు సినిమా ఇండస్ట్రీ వాళ్లు.. ఏదో జరిగిపోతుంది? ఏదో ‍అయిపోతుంది అన్నట్లు హంగామా సృష్టించడం, తీరా చూస్తే అది మూవీ లేదా సోషల్ మీడియా ప్రమోషన్ అని బయటపడుతుంది. మరి మహేశ్ కూడా అదే చేశాడా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement