ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం, దూరదర్శిని, రాజా శివాజీ తదితర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)
ఆర్కే మాస్టర్, లక్కీ, బాబా భాస్కర్ ప్రధాన పాత్రలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మహాబలి 1980స్'కి బొమ్మ సాయికుమార్ దర్శకుడు. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)


