breaking news
mahabali
-
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం, దూరదర్శిని, రాజా శివాజీ తదితర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)ఆర్కే మాస్టర్, లక్కీ, బాబా భాస్కర్ ప్రధాన పాత్రలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మహాబలి 1980స్'కి బొమ్మ సాయికుమార్ దర్శకుడు. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?) -
‘మహాబలి‘ సినిమాలో స్థానికులకు అవకాశాలు : డైరెక్టర్ రోహిత్
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు. -
పురుషాధిపత్యం...
డీ.హీరేహాళ్ :మహిళల రాజకీయ ఎదుగుదలకు భర్తలే అడ్డుగా నిలుస్తున్నారనేందుకు అద్దం పట్టింది బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ ఎంపీపీ భర్త వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... ఎంపీపీ పుష్పావతికి మండల సమస్యలపై మంచి అవగాహన ఉంది. రాజకీయంగానూ ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమెను అసహాయురాలిగా చేస్తూ బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె భర్త మహాబలి అధ్యక్షురాలి సీటు పక్కనే తాను ప్రత్యేకంగా ఆసీనుడయ్యాడు. ప్రజాప్రతినిధులు సంధించిన ప్రతి ప్రశ్నకూ తానే ఎంపీపీ అనే రీతితో సమాధానమిస్తూ అధికారులను సైతం డమ్మీలుగా మార్చేశాడు. భర్త ఆగడాన్ని ఎమ్పీపీ మౌనంగా భరిస్తూ వచ్చారు.


