ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్‌ ఫేవరెట్‌ ఏంటో తెలుసా? | Onam Festival Kerala King Mahabali Pookalam Pulikali | Sakshi
Sakshi News home page

ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్‌ ఫేవరెట్‌ ఏంటో తెలుసా?

Aug 22 2026 11:40 AM | Updated on Aug 22 2026 11:42 AM

Onam Festival Kerala King Mahabali Pookalam Pulikali

ఇరుగు పొరుగు

పిల్లలూ...  ఇప్పుడు కేరళంలో ఓనమ్‌ పండగ సీజన్‌. మనకు దసరా, సంక్రాంతి ఎలాగో... కేరళ వాళ్లకు ‘ఓనమ్‌’ అలా అన్నమాట. ఇది వాళ్ల పెద్ద పండుగ. పూర్వం కేరళను ‘మహాబలి’ అనే ఒక మంచి రాజు పాలించేవాడట. ఆయనంటే ప్రజలందరికీ చాలా ఇష్టం.

ఆ రాజు ఏటా ఒకసారి ఆకాశం నుంచి భూమికి వచ్చి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. ఆ రాజుగారికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పడానికే ఈ ఓనమ్‌ పండుగ చేసుకుంటారు. ఈ పండుగకు పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు! పది రోజుల పాటు రోజూ పొద్దున్నే లేచి, తోటల్లో కలర్‌ఫుల్‌ పూలను కోసుకొస్తారు. ఇంటి ముందు ‘పూకళం’ అంటే పూలతో పెద్ద పెద్ద ముగ్గులు భలే అందంగా పెడతారు. పట్టు లంగాలు, తెల్లటి సాంప్రదాయ బట్టలు వేసుకుని దేవదూతల్లా రెడీ అవుతారు.

ఈ పండుగలో పిల్లలకు మోస్ట్‌ ఫేవరెట్‌ ఐటమ్‌ ఏంటో తెలుసా? ‘పులికలి’ అనే టైగర్‌ డ్యాన్స్‌! కొందరు మనుషులు ఒంటికి పులి లాగా రంగులు వేసుకుని, డప్పుల చప్పుళ్లకు వీధుల్లో డాన్స్‌ చేస్తుంటే పిల్లలు తెగ నవ్వుకుంటారు. అలాగే నదుల్లో పెద్ద పెద్ద పడవ పందాలు జరుగుతుంటే చూసి చప్పట్లు కొడతారు. ఇక పండగ రోజు అరిటాకులో పాయసం, బోలెడు వంటకాలతో కడుపునిండా విందు భోజనం తింటారు. మరి ఈసారి ఓనమ్‌ పండుగకు మీరు కూడా ఇంట్లో పూల ముగ్గులు వేసి ఎంజాయ్‌ చేస్తారా!

ఇవి కూడా చదవండి: 'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement