'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా? | Judo For Kids Benefits Martial Arts Discipline And Self Defense | Sakshi
Sakshi News home page

'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా?

Aug 22 2026 10:09 AM | Updated on Aug 22 2026 10:19 AM

Judo For Kids Benefits Martial Arts Discipline And Self Defense

సెల్ఫ్‌ డిఫెన్స్‌

పిల్లలూ... మీరు ఎప్పుడైనా జుడో ఆటను చూశారా? ఇటలీలో జరుగుతున్న జూడో పోటీల్లో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఎలా పోటీ పడుతున్నారో చూశారా! జూడో అనేది జపాన్‌ దేశంలో పుట్టిన ఒక అద్భుతమైన మార్షల్‌ ఆర్ట్‌.

అయితే ఇది కేవలం కొట్టుకునే ఆట కాదు. జూడో అంటే జపనీస్‌ భాషలో ‘సున్నితమైన మార్గం’ (Gentle Way) అని అర్థం. అంటే... శత్రువు ఎంత బలంగా ఉన్నా, మన తెలివితో, సున్నితమైన పద్ధతులతో వాళ్లని కింద పడేయడం అన్నమాట!

జుడో నేర్చుకోవడం వల్ల మీ చేతులు, కాళ్లు చాలా బలంగా తయారవుతాయి. మీ శరీరం స్ప్రింగ్‌లా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించినా లేదా అటాక్‌ చేసినా... మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ ఆట నేర్పుతుంది. జుడోలో ఆట మొదలుపెట్టే ముందు, ముగించిన తర్వాత ఒకరికొకరు తల వంచి నమస్కారం (Bow) చేస్తారు.

ఇది మనకు క్రమశిక్షణను, ఎదుటివారిని గౌరవించడాన్ని నేర్పుతుంది. ప్రత్యర్థి ఎటువైపు నుంచి వస్తున్నాడో గమనించాలి కాబట్టి మీ ఫోకస్, మైండ్‌ పవర్‌ బాగా పెరుగుతాయి. ఈ ఆటలో గెలవాలంటే పెద్ద పెద్ద కండలు అవసరం లేదు... పక్కా ప్లాన్, మంచి పట్టు ఉంటే చాలు. మీరు కూడా స్కూల్‌ అయిపోయాక ఇలాంటి ఒక మంచి మార్షల్‌ ఆర్ట్‌ నేర్చుకుంటే చాలా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement