రా ఎన్టీఆర్ ప్రెస్‌ మీట్.. భద్రతా కల్పించాలని వినతి | Tirupati Taj Hotel Management Approches Police Security For Raw NTR Press Meet, NTR Team Issues Official Clarification | Sakshi
Sakshi News home page

Raw NTR Press meet: రా ఎన్టీఆర్ ప్రెస్‌ మీట్.. భద్రతా కల్పించాలని వినతి

Jul 17 2026 9:31 PM | Updated on Jul 18 2026 11:04 AM

Taj Hotel Management approches police security for Raw NTR Press meet

టాలీవుడ్‌లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. రా ఎన్టీఆర్‌ పేరుతో జరుగుతోన్న కార్యక్రమాలకు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో రా ఎన్టీఆర్‌ అసోసియేషన్‌ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. తిరుపతిలోనే తాజ్‌ హోటల్‌లో జరగనున్న ఈవెంట్‌కు భద్రతా కల్పించాలని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం తాజ్ హోటల్లో ప్రెస్‌ మీట్ జరగనుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ అసోసియేషన్, రా ఎన్టీఆర్ మధ్య వివాదంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించాలంటూ తిరుపతి రూరల్ పోలీసులను కోరింది.

ఎలాంటి సంబంధం లేదు..

'రా ఎన్టీఆర్' అనే సంస్థకు గానీ, దాని కార్యకలాపాలకు గానీ.. జూ.ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అధికారిక బృందం స్పష్టం చేసింది. ఎలాంటి సేవా కార్యక్రమాలకైనా, ప్రకటనలకైనా ఎన్టీఆర్ టీమ్ లేదా ఆయన మాత్రమే అధికారికంగా మాట్లాడుతారని, రూమర్స్ నమ్మవద్దని మీడియాను కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement