ఎమోషనల్ డ్రామా.. వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ | Venkatramaiah Gari Taluka Movie Review And Rating In Telugu, An Emotional Tribute To Parents And Family Bonds | Sakshi
Sakshi News home page

Venkatramaiah Gari Taluka Movie Review: వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ

Jul 17 2026 9:09 PM | Updated on Jul 18 2026 11:10 AM

Venkatramaiah Gari Taluka Movie review in telugu

దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ జంటగా వచ్చిన మూవీ వెంకట్రామయ్య గారి తాలుకా. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జూలై  17న థియేటర్లలో రిలీజైంది. తండ్రీ, కూతుళ్ల ఎమోషనల్‌ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. మరి ఆ ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

అసలు కథేంటంటే..

వెంకట్రామయ్య - సీత (మురళీధర్ గౌడ్, సుధ) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. పొలం, పిల్లలే వారికి ప్రాణం. ఒక రైతు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేయడమంటే మాటలా? ఇద్దరు ఆడపిల్లల కోసం తనకున్న ఐదెకరాల్లో రెండు ఎకరాల పొలం అమ్మేస్తాడు. కొడుకు తనకు రైల్వే జాబ్ వస్తుంది. రూ.20 లక్షలు కట్టాలంటే మరో ఎకరం అమ్మేస్తాడు. ఇక చిన్న కూతురు లత (దివిజ) తను ప్రేమించిన రాజు (దినేష్)ను పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ రాజుకి సీత తన కూతురును రాజుకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. కానీ తను ఇష్టపడిన వ్యక్తితో కూతురి వివాహం చేయాలనుకున్న వెంకట్రామయ్య.. భార్యకు నచ్చజెప్పి వివాహం జరిపిస్తాడు. అయితే సీత భయపడిందంతా జరుగుతుంది. అత్తవారింట లత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. మరోవైపు వెంకట్రామయ్య కొడుకు మురళి సైతం ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. పిల్లలంతా వివాహాలవడంతో ఆడపిల్లలు అత్తవారిళ్లకు.. కొడుకు ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. ఇక ఉన్న ఒక ఎకరంతో ఎలాగైనా బతుకుదామనుకుంటే అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఎకరం పొలం అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింద? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

1992లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటించిన సూరిగాడు చిత్రం వచ్చింది. ఆ సినిమా కూడా ఒక తండ్రి కథే. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్. నలుగురు పిల్లలున్నా.. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. అదే తల్లిదండ్రులు తరువాతి కాలంలో పిల్లలకు భారంగా ఎందుకు మారుతున్నారనేదే కథ. తొలి అర్థ భాగమంతా.. వెంకట్రామయ్య తన పొలాన్ని అపురూపంగా చూసుకోవడం.. పొలాన్ని పరువుగానూ.. గౌరవంగానూ భావించడం.. పిల్లల కోసం దాన్ని అమ్ముకోవల్సి రావడం అలా రోటీన్‌గా సాగుతుంది.

ఇక సెకండాఫ్‌లో కంప్లీట్‌గా వెంకట్రామయ్య చుట్టూనే కథ నడుస్తుంది. ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా సెకండాఫ్ చూస్తున్నప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు. ఇక క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కుతుంది. కళ్ల నిండా నీళ్లతో బయటకు వస్తారు. పల్లెటూరి కథలు ఇటీవలి కాలంలో వచ్చినా కూడా లవ్ స్టోరీకే పరిమితమవుతున్నాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అనేది రావడం లేదు.

ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు.. నేటి సమాజానికి అద్దం పట్టే భావోద్వేగ ప్రయాణం. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, వారి కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవనశైలిని పరిచయం చేస్తాయి. ఆ తరువాత కథ భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. రెండో భాగంలో వచ్చే తండ్రీ, కూతుళ్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్య సంభాషణలు లేకుండా జాగ్రత్తపడ్డారు.

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రూపొందించారు. యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్న మనుషులు.. క్రమంగా దూరమవుతున్న కుటుంబ బంధాలు... వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో ఓ మధ్యతరగతి తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలే 'వెంకట్రామయ్య గారి తాలూకా' కథ. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, మానవ సంబంధాల విలువలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఓవరాల్‌గా వెంకట్రామయ్య గారి తాలుకా’ ఓ ఫీల్ గుడ్ మూవీ.

ఎవరెలా నటించారంటే..

దివిజ, దినేశ్ ఇద్దరు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. సుధ తల్లిగా చాలా సహజంగా నటించారు. ఇక మిగిలిన నటీనటులంతా వారి పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో మరింత కట్ చేయాల్సింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement