కిషోర్, ఖాన్ దురాని, సాహితి ఆవంచ, రవి
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరో యిన్లుగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్య నారాయణ రెడ్డి, నటుడు సురేష్ అతిథులుగా పాల్గొన్నారు.
ఖాన్ దురాని మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో ఉన్న నాలుగు పాటలకు శ్రీ మురళి మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లోని కొన్ని ఘటనలకు కల్పిత అంశాలు జోడించి రూపొందించిన ఈ చిత్రంలో మంచి లవ్‌స్టోరీ ఉంది’’ అని చెల్పిరు రవి లోకిరెడ్డి. ‘‘సినిమాలపైప్యాషన్‌తో కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాను.
యూఎస్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశా. ‘కళ్యాణం కమనీయం..’లో ప్రేక్షకులు కోరుకునే అంశాలున్నాయి’’ అన్నారు కిషోర్ గుండాల. ‘‘రామాయణం ఎవరి కథ కాదమ్మా! కానీ అందులో నీతి ఎందరో జీవితాలకు దారి, ఇంత చిన్న వయసులో వారికి పెళ్లి చేస్తున్నావ్’, ‘ఇక మా మధ్య ఎవరూ లేరు’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి.


