లైఫ్‌ ఆఫ్‌ సంజూ | Sahaa Movie Kaalanne Thiragesi Song Launch | Sakshi
Sakshi News home page

లైఫ్‌ ఆఫ్‌ సంజూ

Jul 18 2026 1:20 AM | Updated on Jul 18 2026 1:20 AM

Sahaa Movie Kaalanne Thiragesi Song Launch

శివ కుమార్‌ కాసారం హీరోగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సహ’ (లైఫ్‌ ఆఫ్‌ సంజూ). నిశాంత్‌ దోటి దర్శకత్వంలో తేజేశ్వర్‌ వేల్పుచర్ల నిర్మించారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాలాన్నే తిరగేసి...’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి పాడారు.

ఈ పాట ఆవిష్కరణ వేడుకకు అతిథిగా హాజరైన హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు ఇదొక మంచి సినిమా అని చెబుతారనే నమ్మకం ఉంది’’ అని నిశాంత్‌ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం మా అందరికీ మంచి భవిష్యత్తుని ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు శివ కుమార్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement