ప్రెగ్నెన్సీలోనూ యాక్షన్‌కి సై | Deepika Padukone shoots gruelling action scenes for Raaka while 7 months pregnant | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీలోనూ యాక్షన్‌కి సై

Jul 18 2026 12:36 AM | Updated on Jul 18 2026 12:36 AM

Deepika Padukone shoots gruelling action scenes for Raaka while 7 months pregnant

సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అయితే దీపికా పదుకోన్‌ మాత్రం ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ రిస్క్‌ చేస్తున్నారు. ‘రాకా’ సినిమా కోసం యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొంటున్నారామె. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారట దీపిక. ఇదిలా ఉంటే... హీరో రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్‌ 2018 నవంబరు 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ దంపతులకు దువా అనే కుమార్తె ఉంది. తాను రెండోసారి తల్లి కానున్నట్లు దీపిక ఈ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. అయినప్పటికీ ‘రాకా’ కోసం రాత్రిపూట కూడా పని చేస్తూ, రిస్కీ యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తూ, నటనపై తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారామె. ప్రసూతి సెలవులకు వెళ్లేలోపే ‘రాకా’లోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో దీపిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ మధ్య ఎనిమిది గంటల పని నిబంధనను తెరపైకి తీసుకొచ్చిన దీపిక ‘రాకా’ కోసం ఎలాంటి నిబంధనలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement