‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ. . బన్నీతో మరోసారి.. | Rashmika Mandanna To Reunite With Allu Arjun For Raaka | Sakshi
Sakshi News home page

‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ. . బన్నీతో మరోసారి..

Jun 27 2026 2:21 PM | Updated on Jun 27 2026 3:00 PM

Rashmika Mandanna To Reunite With Allu Arjun For Raaka

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మరోసారి వెండితెరపై జోడీగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే పుష్ప, పుష్ప 2లో చిత్రాల్లో జోడీగా నటించి మెప్పించిన ఈ జంట.. ఇప్పుడు ‘రాకా’ కోసం మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారట. త్వరలోనే ముంబైలో జరగబోయే కొత్త షెడ్యూల్‌లో రష్మిక పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో రష్మికతో పాటు దీపికా పదుకొణె, మృణాల్‌ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌  కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే దీపికా పదుకొణె షూటింగ్‌లో పాల్గొంది. కొత్త షెడ్యూల్‌లో రష్మికతో పాటు మృణాల్‌, జాన్వీలకు సంబంధించిన కీలక సీన్లను కూడా షూట్‌ చేయబోతున్నారట. 

ఇక ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ కూడా కీలక పాత్ర చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ ఈవెంట్‌ నిర్వహించి, షారుక్‌ పాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తారట.ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ రూ. 700 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ పూర్తి చేసుకొని.. వచ్చే ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement