కొంచెం ఆలస్యంగా థియేటర్స్‌కు వస్తున్నాడు జీడీ నాయుడు. ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, మిరాకిల్ మ్యాన్, ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) బయోపిక్ ‘జి.డి.ఎన్’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇందులో జీడీ నాయుడు పాత్రలో మాధవన్ నటించారు. ఈ సినిమాని కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, సరిత మాధవన్, విజయ్ మూలన్, వర్గీస్ మూలన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ చేయలేదు... ఆగస్టు 7న రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్.


