Padma Shri ceremony: మాధవన్ చేతికి ధరించిన వాచ్‌ అంత ఖరీదా..! | R Madhavan wore a Rs 40 lakh Titan Watch While Receiving Padma Shri | Sakshi
Sakshi News home page

మాధవన్ చేతికి ధరించిన వాచ్‌ అంత ఖరీదా..!

Jun 25 2026 4:57 PM | Updated on Jun 25 2026 5:10 PM

R Madhavan wore a Rs 40 lakh Titan Watch While Receiving Padma Shri

రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం గత మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. వారిలో కోలీవుడ్‌ నటుడు మాధవన్‌ కూడా ఉన్నారు. ఈ వేడుకలో మాధవన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 

ఈ వేడుకలో ఆయన చేతికి ధరించి వాచ్‌ అత్యంత హైలెట్‌గా నిలిచింది. ఇది జైపూర్‌ కళాఖండం. అత్యంత విలువైన టైటాన్ నెబ్యులా జల్సా ఫ్లయింగ్ టోర్బిలాన్‌ వాచ్‌ ఇది. 2025లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ వాచ్‌ని ఆవిష్కరించారు. ఇది గడియారాల తయారీలో అత్యంత శ్రేష్టతనుకలిగి ఉన్నది. ఆ బ్రాండ్‌ అధికారిక వైబైస్‌ట్‌ప్రకారం..నెబ్యులా వారి 'జల్సా' అనేది జైపూర్‌కు ఒక ధైర్యమైన నివాళి . - ఆ నగరం విజయాల కోసం నిర్మించబడలేదు, కానీ ఒక దివ్యదృష్టితో రూపుదిద్దుకుంది అని పేర్కొంది. ఈ వాచ్‌ డయాల్‌ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. 

జ్యామితిని కవిత్వంగా మార్చి, వాస్తుశిల్పాన్ని పునర్నిర్వచించి తన విశిష్టమైన, క్లిష్టమైన పనితనంలో ఇప్పటికీ మంత్ర ముగ్ధుల్ని హవామహల్‌ ఉంటుంది. అంతేగాదు ఈ డయల్‌పై పద్మశ్రీ షకీర్ అలీ చేత పాలరాయిపై చేతితో చిత్రించిన ఒక సూక్ష్మచిత్రం ఉంది. ప్రతి డయల్ ప్రకాశవంతమైన రంగులలో ఊహించిన ఒక క్షణాన్ని బంధిస్తుంది. హవా మహల్ ముందు ఒక రాజ ఊరేగింపు, విజయం, గౌరవం, వైభవానికి నివాళి. దీన్ని ఒకే వెంట్రుక గల ఉడుత కుంచెతో ఒక్కో గీత ఉపయోగించి చిత్రించిన చారిత్రక దృశ్యమట ఆ మహల్‌ చిత్రం. అంతేగాదు ప్రపంచంలో ఇలాంటి వాచ్‌లు కేవలం పది మాత్రమే ఉన్నాయి. 

 ప్రతి ఒక్కటీ ఒక వారసత్వ సంపద. వాచ్‌లోపల శిల్ప కళతో చెక్కిన 18k రోజ్ గోల్డ్ టోర్బిలాన్, జైపూర్‌ఎర్ర ఇసుకరాయి వాస్తు శిల్పాన్ని ప్రతిబింబించే సహజమైన ఎర్ర అగేట్‌ రత్నం వలయం చుట్టూ చుట్టబడి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ వాచ్‌ ధర వచ్చేసి దాదాపు రూ. 40 లక్షలు పైనే ఉంటుందట. ఈ మేరకు మాధవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు నేను ఎంతో వినమ్రతతో, అత్యంత కృతజ్ఞతతో దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన దీనిని నాకు ప్రదానం చేసినందుకు భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నా పేరును సిఫార్సు చేసి, నా ప్రయాణంపై నమ్మకం ఉంచిన మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అంతే కృతజ్ఞుడను. ఈ గుర్తింపును నా జీవితాంతం ఎంతో విలువైనదిగా భావిస్తాను." ఈ గౌరవాన్ని సినిమా అనే అద్భుత ప్రపంచానికి, నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి కళాకారుడికి, సాంకేతిక నిపుణుడికి, అలాగే నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు," అని పోస్ట్‌ని ముగించారు.

(చదవండి: సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement