భారత దిగ్గజ ఆవిష్కర్త కోయంబత్తూర్ కు చెందిన జీడీ నాయుడు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు. ఆయన (1893–1974) కాలంలోనే ఎడిషన్ ఆప్ ఇండియా, వెల్త్ క్రయేటర్ ఆఫ్ కోయంబత్తూర్ గా ప్రసిద్ధి స్వయం కృషితో ఎదిగిన గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త, విద్యా సేవకుడు. దక్షిణ భారత పారిశ్రామిక అభివద్ధికి బలమైన పునాదులు వేశారు. భారత దేశంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్,రాసంట్ రేజర్, ఓటు నమోదు యంత్రం, 1952లో రూపొందించిన రెండు సీట్ల పెట్రోల్ కారు వంటి పలు ఆవిష్కరణల కర్త ఈయన. సర్ సీవీ.రామన్, సర్ ఎం.విశ్వేశ్వరయ్య, డా.అంబేడ్కర్ వంటి మహానీయులు ప్రశంసలు అందుకున్న గొప్ప ఆవిష్కర్త జీడీ.నాయుడు.
1967లోనే పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు జీడీఎన్ పేరుతో చిత్రం రూపొందడం విశేషం. ఈ చిత్రంలో నటుడు మాధవన్ టైటిల్ పొత్రను పోషించడం మరో విశేషం.నటుడు సత్యరాజ్, ప్రియమణి, దంషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య,నందలాల్, షీలా,కరుణాకరన్,మురళిధరన్,అతిది బాలన్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను కష్ణకుమార్ రామ్ కుమార్ నిర్వహించారు. వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, మాధవన్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్ కమలనాధన్ ఛాయాగ్రహణం, గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి చెందిన కరీ మోటార్ స్పీడ్ వే లో ఘనంగా నిర్వహించారు. నటుడు, నిర్మాతల్లో ఒకరైన మాధవన్ మాట్లాడుతూ ‘‘ జీడీ నాయుడు కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు .ఆయన గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి. అసాధారణ విజయాలను సాధించిన మహానుభావుడు.అంతకంటే ముఖంగా నిజమైన దేశభక్తుడు.ఆయన సేవలు అన్ని రంగాల్లోనూ విస్తరించాయి.అంతటి అద్భుతమైన జీవిత చరిత్ర తమిళనాడుకే కాకుండా దేశమంతటికి తెలియాల్సిన అవసరం ఉందని భావించాం.అదే జీడీఎన్ చిత్రం.’’ అని మాధవన్ పేర్కొన్నారు.


