అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ షూట్‌కి చిన్న బ్రేక్ వచ్చిందట. దీంతో అల్లు అర్జున్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తన తర్వాతి సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను ముంబై పిలిపించి, ఆ సినిమా గురించి చర్చలు జరపనున్నారట.
అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 23వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొన్ని రోజులుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్ సరికొత్తగా ఉంటుందని, ఇందుకోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంటుందని తెలిసింది. తాజాగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన కొన్ని లుక్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో లోకేష్ ఉన్నారట. ఈ వారంలోనే లుక్ టెస్ట్‌ను కూడా ప్లాన్ చేశారని, ముంబైలో లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో చిత్రబృందం పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది.


