మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ శివాంగ్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో బుందేల్‌ఖండ్ బుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శివాంగ్.. బుధవారం మాల్వా స్టాలియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మాల్వా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అన్ష్ యాదవ్ (44 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు సక్షమ్ పురోహిత్(40), అఖిల్(33) రాణించారు. బుందేల్‌ఖండ్ బౌలర్లలో అనంత్ దూబే, శివాంగ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
శివాలెత్తిన శివాంగ్
అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో శివాంగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శివాంగ్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు విక్రాంత్(43), అమన్ జైన్(17) రాణించారు.
ఫలితంగా బుందేల్‌ఖండ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. మాల్వా బౌలర్లలో పార్థ్ సహాని, ప్రశాంత్, పవన్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున శివాంగ్ 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.


