కృష్ణాజిల్లా: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణ కోసం బుధవారం గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బీబీ గూడెం గ్రామానికి చెందిన సాయిల సందీప్, జ్యోత్స్న రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న తండ్రి రంగారావు నెల రోజుల క్రితం పచ్చడి బండతో సందీప్‌పై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలైన అతడికి పిన్నమనేని సిద్ధార్ధ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేశారు. అనంతరం కోలుకున్న సందీప్ బుధవారం ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కోసం ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.


