'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ? | Tourist Family Actress Yogalakshmi Details | Sakshi
Sakshi News home page

Tourist Family Actress:‍ పాత్ర చిన్నదే కానీ ఇంపాక్ట్ మాత్రం.. ఈమె ఎవరంటే?

Jun 11 2025 10:37 AM | Updated on Jun 11 2025 10:53 AM

Tourist Family Actress Yogalakshmi Details

రీసెంట్ టైంలో ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదో తమిళ మూవీ. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడంతో మనోళ్లకు కూడా ఇది నచ్చేసింది. ఈ చిత్రంలో చిన్న పిల్లాడిగా చేసిన కమల్ జగదీశ్ కాకుండా ప్రధాన పాత్రధారి ధర్మదాస్.. ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి కూడా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే గానీ యువతకు తెగ నచ్చేసింది. దీంతో ఈ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈమె ఎవరంటే?

(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)

'టూరిస్ట్ ఫ్యామిలీ'లో ధర్మదాస్ అద్దెకు ఉండే ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి అసలు పేరు యోగలక్ష‍్మీ. చూడటానికి డస్కీగా ఉన్నప్పటికీ ఈమె యాక్టింగ్‌కి యూత్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని ఈమె ప్రపోజల్ సీన్‌ని రిపీట్స్‌లో చూస్తున్నారు. ఈమె విషయానికొస్తే.. ఈ సినిమా కంటే ముందు 'హార్ట్ బీట్', 'సింగపెన్నె' అనే వెబ్ సిరీసులు చేసింది. కాకపోతే ఓ మాదిరి గుర్తింపు మాత్రమే దక్కింది.

ఈ మధ్య యూట్యూబ్‌లో 'మ్యాచ్ ఫిక్సింగ్' షార్మ్ ఫిల్మ్‌లోనూ యోగలక్ష‍్మీ నటించింది. ఈమెది తమిళనాడే అయినప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనే డీటైల్స్ దొరకట్లేదు. ప్రస్తుతానికైతే 'టూరిస్ట్ ఫ్యామిలీ' వల్ల ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఈమె అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈమెపై కొన్ని మీమ్స్ కూడా వస్తుండటం విశేషం. మరి తెలుగులోనూ ఎవరైనా దర్శక నిర్మాతలు ఈమెకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి?

(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement