
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. చివరగా 2023లో వచ్చిన 'సువర్ణ సుందరి' మూవీలో కనిపించారు. తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి ఈయన్న ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు.
(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)
'కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటోలోని కోటా శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే సదరు ఫొటోలో కోటా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'తోనే కోటా శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, దక్కనీ భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం. ఇప్పటికీ పాత సినిమాల సీన్లనీ యూట్యూబ్‌లో చూస్తుంటే అరె ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనని దూరం పెట్టాల్సి వచ్చింది.
(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)

