హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు | Actor Mohanlal Maternal Uncle Demise | Sakshi
Sakshi News home page

Mohanlal: పేరు పెట్టిన వ్యక్తిని కోల్పోయిన స్టార్ హీరో

Jun 10 2025 6:04 PM | Updated on Jun 10 2025 6:19 PM

Actor Mohanlal Maternal Uncle Demise

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హీరో మోహన్ లాల్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్', 'తుడరుమ్' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు మూవీ 'కన్నప్ప' రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అలాంటి ఈయన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?)

మోహన్ లాల్‌కి మేనమామ గోపీనాథన్ నాయర్(93) ఉన్నారు. గతంలో అలప్పుజా కో ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‪‌గా పనిచేసిన ఈయన.. వయసు మీద పడటంతో గత 14 ఏళ్ల నుంచి మాత్రం అమృతపురిలోని మాత అమృతానందమయి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ కుటుంబ సభ్యులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

మోహన్ లాల్‌ అసలు పేరు రోషన్ లాల్. కానీ మేనమామ అయిన గోపీనాథన్.. ఈ పేరుని కాస్త మార్పు చేసి మోహన్ లాల్ అని పెట్టారు. తర్వాత తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. మోహన్ లాల్ మామతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అంత్యక్రియలు కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోనున్నారు.

(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement