చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే చాలు.. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ హిట్ చేసేస్తారు. అలాంటి సినిమా ఈ ఏడాది అలరించిన టూరిస్ట్ ఫ్యామిలీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది.
ఈ ఏడాది మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధించింది . కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ మూవీతో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. అభిషన్ జీవింత్ యూట్యూబర్ కావడం మరో విశేషం.
అయితే తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్కు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన ఈనెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ ఖరీదైన బహుమతిచ్చారు. పెళ్లి చేసుకోబోతున్న అభిషన్కు బీఎండబ్ల్యూ కారును మ్యారేజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డైరెక్టర్కు విషెస్ చెబుతున్నారు.
Producer of #TouristFamily, #GoodNight, & #Lover, @mageshraj of @MRP_ENTERTAIN, has gifted a BMW SUV to Tourist Family director @Abishanjeevinth as a wedding gift.
The young filmmaker, who has also turned hero, is all set to tie the knot on October 31 this year.… pic.twitter.com/fuJg1uTW5Z— Ramesh Bala (@rameshlaus) October 28, 2025


